సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అమరావతి పై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం నేడు, సోమవారం సుప్రీం కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. రాజధాని కేసును త్వరగా విచారణ చెప్పట్టాలని..పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్ కె.ఎం .జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనంవద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు. ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె.ఎం .జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *