సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల వరుస వివాదాలలో ఇరుకొంటున్న ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నిన్నటి అక్కినేని.. రంగారావు.. వివాదం ఇంకా ముగియకముందే.. తాజా గ పవన్ కళ్యాణ్ తో చేసిన ఆన్ స్టాపబుల్ లో తనకు ఆక్సిడెంట్ జరిగినప్పుడు ఆసుపత్రిలో ఒక అనుభవాన్ని గుర్తుచేస్తూ అక్కడి నర్సు అందంగా ఉందని.. మొరటు మాట.. మాట్లాడటంతో తెలుగు రాష్ట్రాలలో పలు ఆసుపత్రుల వద్ద నర్సులు ఆందోళన కు దిగి తమను బాల్యయ్య బహిరంగ క్షామాపణలు కోరాలని, తమసేవాభావాన్ని కించపరిచేలా బాలకృష్ణ ఆలా వెకిలి మాటలు ఎలా? మాట్లాడారని, అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్వాందించాలని డిమాండ్ చేసారు.. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం బాలకృష్ణ ఒక పోస్ట్ పెట్టారు. దానిలో.. ‘నర్సుల ను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’’ అని బాలయ్య పోస్ట్ పెట్టారు.
