సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం నేడు, సోమవారం టర్కీ , సిరియా దేశాలను కుదిపేసింది. సైప్రస్, లెబనాన్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకూ 13 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు అని తాజా వార్త సమాచారం..పూర్తీ సమాచారం వస్తే వీరి సంఖ్యా భారీగా పెరిగే అవకాశం ఉంది.. వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది.భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్‌మెంట్లు కూలిపోయాయని, భారీ ఆస్తినష్టం జరిగింది. ఎక్కడ చుసిన అపార ప్రాణ ఆస్తి నష్టంతో అంతులేని విషాదాలు నిండుకొన్నాయి.
