సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వార్షిక మహోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. నేడు,సోమావారం ఫిబ్రవరి 6 వ తేదీ న శ్రీ అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి దేవి అవతారంలో భారీ గజమాల ధరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారి అలంకారం ను స్థానిక భక్తులు వీరా హరినాధ్ బాబు, స్రవంతి దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఈ ఉత్సవాలలో నేటి రాత్రి 8 గంటలకు రాజమండ్రి కళాకారులచే ఆధునిక సెట్స్ లో ‘ సత్యహరిచంద్ర ‘ నాటకం ఆహుతులను విశేషంగా అలరించనుంది. ఈ నెల 10 వ తేదీ న లక్షమంది భక్తులకు అఖండ అన్నసమారాధన తో ఉత్సవాలు ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *