సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వార్షిక మహోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. నేడు,మంగళవారం ఫిబ్రవరి 7 వ తేదీ న శ్రీ అమ్మవారు శ్రీ విజయ లక్ష్మి దేవి అవతారంలో 8 చేతులతో దివ్య ఆయుధాలు ధరించి భక్తులకు అభయం ఇస్తూ దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారి అలంకారం ను స్థానిక భక్తులు స్థానిక గునుపూడి కి చెందిన స్వర్గీయ నందమూరి తాతాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఈ ఉత్సవాలలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటి మంగళవారం రాత్రి తో ముగియనున్నాయి. రేపు ఎల్లుండి విశ్రాంతి.. అయితే శ్రీ అమ్మవారి రోజువారీ అవతారాలు కొనసాగుతాయి. నేటి రాత్రి 8 గంటలకు శ్రీ మావుళ్ళమ్మ నాట్యమండలి కళాకారులచే ఆధునిక సెట్స్ లో ‘గయోపాఖ్యానము ‘ నాటకం ప్రదర్శిస్తారు. విశేషంగా అలరించనుంది. ఈ నెల 10 వ తేదీ న లక్షమంది భక్తులకు అఖండ అన్నసమారాధన తో ఉత్సవాలు ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *