సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని ఇరగవరం మండలం అయితం పూడిలాకుల వద్ద నేటి ఆదివారం తెల్లవారు జామున 5 గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి నరసాపురం కాల్వ లోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. పోలీసులు గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. వీరు నరసాపురం లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువు తుండగా వీరి మిత్రుని వివాహం లో పాల్గొనడానికే గత రాత్రి పెరవలిలో శుభకార్యానికి హాజరై తదుపరి, తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామానికి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. ఇందులో ఒకరికి ఈత రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోతుల లక్ష్మీ భాను (18), రాజారాం (17), నాగిరెడ్డి,దుస్వంత(18), సాయి సూర్య (19) గల్లంతైన వారిలో ఉన్నారు తాజా సమాచారం ప్రకారం ..పోతుల లక్ష్మీ భాను, నాగిరెడ్డి దుస్వంత మృతదేహాలను నరసాపురం కాలువ నుంచి అగ్ని మాపక సిబ్బంది వెలికితీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *