సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల విస్తరిస్తున్న కార్పొరేట్, ఆన్‌లైన్ మెడికల్ మార్కెటింగ్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ వ్యాపారులు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపడతున్నట్టు ఆల్ ఇండియా ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి కె.పి.రంగారావు తెలిపారు. ఆయన గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ఆన్‌లైన్ ఫార్మారంగం విస్తరించడంతో వ్యాపారులతో పాటు ప్రజల కూడా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పనిలో పనిగా ఆన్‌లైన్ అక్రమ వ్యాపారం, నకిలీ మందుల అమ్మకాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిరసనల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లా కార్యాలయాల ఉన్నతాధికారులకు స్థానిక మెడికల్ వ్యాపారులు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
