సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి టీపీ గూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో నిర్మించిన భారీ రైల్వే టర్నల్ బ్రీజ్ కొద్దీ కాలం క్రితం ప్రారంభము అయ్యి ట్రాఫిక్ రద్దీని బాగా తగ్గించిన మాట వాస్తవం.. ప్రతి రోజు వేలాది వాహనాలు , విద్యార్థులు ఈ టర్నల్ క్రింద నుండి రోజు ప్రయాణిస్తున్నారు. అయితే బ్రీజ్ మధ్యలో ప్రధాన రైల్వే ట్రాక్ క్రింద నిర్మించిన అండర్ టర్నల్ వద్ద గత నెల రోజులుగా క్రింద నుండి నీరు ఊరటం లేదా డ్రైనేజ్ లీక్ అవ్వడంతో అక్కడ ఒక అడుగు మేర మురుగునీరు నిలిచిపోయి వాహనదారులకు చాల ఇబ్బందిగా ఉంటుంది. వేగంగా వచ్చే వాహనాలు అకస్మాత్తుగా లోతులో అక్కడ నీరు ఉండటం చూసి వేగం అదుపు చేయలేకపోతున్నారు. దీనితో ప్రక్కన వెళ్లే ద్విచక్ర వాహనదారులపై ఆ నీరు చిమ్ముతుంది. అలాగే బైకు లు స్క్రిడ్ అయ్యి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది.. ఈ మురుగునీటి సమస్య ఎక్కడ ఉంది ? అన్నది రైల్వే ఇంజనీర్లు , స్థానిక మునిసిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితంగా సరిచేస్తే ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు తగ్గుతాయి. నిజానికి అండర్ టర్నల్ నిర్మాణంలో ఎపుడయిన వర్షపు నీరు చేరితే మోటరుతో తోడెయ్యడానికి ఆధునిక ఆటోమేటిక్ సెన్సార్ ఏర్పాటు చేస్తామన్నారు కానీ ప్రస్తుత ఈ సమస్యకు కారణం తెలియవలసి ఉంది. ( up update photo)
