సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దాదాపు దశాబ్దం తరువాత షారుక్ ఖాన్ ‘పఠాన్’సినిమా ఘనవిజయం తో మరోసారి బాలీవుడ్ బాద్షా గా నిరూపించుకొని విజయవిహారం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అట్లీ దర్శకత్వం లో రానున్న ‘జవాన్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. షారుక్ సరసన సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ నయనతార నటిస్తోన్న ఈ సినిమాలో పుష్ప.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారనే … నేడు, సోమవారం తాజా సమాచారం వచ్చింది.. దీనితో ఈ సినిమా క్రెజ్ మరింత పెరిగిపోయింది. ‘జవాన్’లో అతిథి పాత్ర కోసం ఇప్పటికే ఆ నిర్మాతలు అల్లు అర్జున్ ను భారీ రెమ్యూనేషన్ ఆఫర్ తో సంప్రదించినట్లు సమాచారం.. దీనితో తెలుగులో కూడా షారుక్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు రికార్డు బిజినెస్ అవ్వడం ఖాయం.. అతి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని బాలీవుడ్ ఫిల్మ్ వర్గ్లల సమాచారం.. ప్రస్తుతం అల్లు అర్జున్ , జగపతి బాబుతో కల్సి పుష్ప 2 సినిమా కోసం వైజాగ్ పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
