సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల వై యస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ కు సంబంధం అంటగడుతూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చేస్తున్న విషప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శిస్తూ సంచలన వ్యాక్యలు చేసారు. స్వంత వివేకానంద కుటుంబసభ్యులే జగన్ ఫై ఆరోపిస్తున్నారు అని టీడీపీ వారు అంటున్నారు. అది సహజమే కదా? ఎందుకంటే వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన కుటుంబం ఫై కక్ష పూరిత చర్యలను ఎదిరిస్తూ రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేస్తే వివేకానంద రెడ్డి ఆయన కుటుంబం జగన్ ప్రత్యర్థి పార్టీ తరపున పోటీకి నిలిచి వారిని ఓడించడానికి, సర్వ నాశనం చేయడానికి ప్రయత్నించారని కొడాలి నాని వ్యా ఖ్యానించారు. ఒకవేళ వివేకానందరెడ్డి బ్రతికున్నాసరే.., జగన్.. కడప ఎం పీ సీటును అవినాష్ రెడ్డికే ఇచ్చే వారు. ఎందుకంటే జగన్ కష్టాలలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేస్తే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి ఉండి ఆయన విజయం కోసం పాటుపడ్డారు. వారికే జగన్ సీటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *