సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి టీపీ గూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో నిర్మించిన భారీ రైల్వే టర్నల్ బ్రీజ్ వద్ద గత నెల రోజులుగా క్రింద నుండి నీరు ఊరటం లేదా డ్రైనేజ్ లీక్ అవ్వడంతో అక్కడ మేర మురుగునీరు నిలిచిపోయి గలేజి గా ఉండి వాహనదారులకు చాల ఇబ్బందిగా ఉంటుందని నిన్న మన సిగ్మా న్యూస్ లో వేసిన వార్తకు అధికారులు వెంటనే స్వాదించారు. నేటి మంగళవారం ఉదయం లీక్ అయిన మురుగునీరు లేకుండా శుభ్రం చెయ్యడం జరిగింది. ( ఫై తాజా చిత్రంలో చూడవచ్చు ) దీనితో వాహనదారులు ఉత్సహంగా అదే వేగంతో ముందుకు దూసుకొనిపోవడం జరిగింది. ఈ టర్నల్ బాగా నీరు ఉబికే ప్రాంతంలో ఆధునిక సాంకేతికతో నిర్మించినప్పటికీ , ప్రక్కనే యనమదురు కాలువ ప్రవహించడం తదితర కారణాల వల్ల టర్నల్ క్రింద వర్షపు నీరు వెళ్లిపోవడానికి నిర్మించిన డ్రైన్ లో ప్రతి రోజు కొద్దిపాటి నీరు చేరటంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అధికారులు వాహదారులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత ప్రాతిపదికన మురుగు నీరు లేకుండా ఇదే స్ఫూర్తి తో పనిచేయవలసి ఉంది. అలాగే కేంద్ర రైల్వే శాఖ పరిధిలో జరిగిన ఈ టర్నల్ నిర్మాణం కు అటు ఇటు గా ప్రధాన రోడ్లను కలుపుతూ పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అప్రోచ్ రోడ్లను త్వరితంగా నిర్మిస్తే వాహనదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *