సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీబీనగర్-ఘట్కేసర్ మధ్య గోదావరి ఎక్స్ ప్రెస్(12727) పట్టాలు తప్పి న నేపథ్యం లో నేడు 7 రైళ్లుపూర్తిగా.. 12 పాక్షికంగా రద్దయ్యాయి. నేటి బుధవారం ఉదయం గోదావరి ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బీబీనగర్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్ మరమ్మ తుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా..మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.రద్దయిన రైళ్లలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సికింద్రాబాద్-గుంటూరు (12706) గుంటూరు-సికింద్రాబాద్ (12705) సికింద్రాబాద్-రేపల్లె (17645) ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *