సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల (చిన్న తిరుమల )లో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల పోటీలు జరుగనున్నాయి. మార్చి 17న ప్రారంభంకానున్న ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ద్వారకాతిరుమల మార్కెట్ యార్డ్‌ లో పాల, అందాల పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు , పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల కోసం వచ్చే ఆవులు విశ్రాంతి కోసం భారీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల పోటీల కోసం, అలాగే అందాల పోటీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలో నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పోటీదారులు పాల్గొనేందుకు అవకాశం ఉందని . ప్రధాన బహుమతులతో పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయని నిర్వాహకుల కమిటీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *