సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోకి గణపవరం మండలాన్ని పూర్తిగా విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజగా ఆమోద పత్రాన్ని విడుదల చేసింది. గతంలో గణపవరం వచ్చిన సీఎం జగన్ కు స్థానిక ప్రముఖులు ఉంగుటూరు ఎమ్మెల్యే పుష్పాల వాసుబాబు చేసిన విజ్ఞప్తి లో గణపవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన భీమవరం కు కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంటుందని తమను భీమవరం రెవెన్యూ డివిజన్ లో చేర్చమని అడగటం, దానికి సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా చేసిన కృషి తో నేటి కి పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం చేరడం పరిపూర్ణం అయ్యింది. గణపవరం మండలానికి సంబంధించిన రెవెన్యూ దస్త్రాలు తమవద్దకు వస్తున్నాయని భీమవరం ఆర్డీవో దాసి రాజు తెలిపారు. పశ్చి మగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 19 మండలాలు ఉండగా గణపవరం చేరికతో ఆ సంఖ్య 20 అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా జనాభా 17.5 లక్షలు కాగా గణపవరం మండల జనాభా చేరికతో 18.45 లక్షలకు చేరింది. ఇకపై జిల్లా వైశాల్యం 2,278 చదరపు కిలోమీటర్లు కు పెరిగింది. ( ఫై ఫోటో గతంలో గణపవరం లో సీఎం జగన్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *