సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: టీడీపీ అధనేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో నేడు, శుక్రవారం మూడో రోజు ఆఖరి రోజు పర్యటన అనపర్తి లో కాస్త ఉద్రికతగా మారింది. . ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అనపర్తిలో నిర్వహించారు. చంద్రబాబు ప్రధాన రహదారిపై బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి లేదని , ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని రోడ్డుపై సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ సభ నిర్వహించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించడంతో వారిని అక్కడ నుండి వెళ్లగొట్టి బరికెట్స్ ఏర్పాట్లు చేసి పోలీసులు గస్తీ కాసారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ భక్తవత్సల సూచించారు.పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నేటి శుక్రవారం సామర్లకోట నుంచి సాయంత్రం 4 గంటలకు బిక్కవోలు మండలం ఇళ్ళపల్లి జోడు నాదాల తూము వద్ద అనపర్తి నియోజకవర్గంలో అక్కడి నుంచి బైక్‌ ర్యాలీతో అనపర్తి చేరుకుని మెయిన్‌రోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అయిదు న్నర గంటలకు చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుందని ..రాష్ట్రంలో దుర్భర పాలన జరుగుతుందని .. తాజగా మహాసేన రాజేష్ టీడీపీ లో చేరటం శుభ పరిణామం అని తేనెప్పుడు ఎస్ సి ఎస్టీ లను , రైతులను కించపరచలేదని వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎస్ సి ఎస్టీలకు చేసిన మేలు వైసిపి చెయ్యలేదని దీనిపై వాదనకు బహిరంగ సవాల్ చేసారు మహ సేన రాజేష్. చంద్రబాబు నేటి రాత్రి 8.45 గంటలకు రామవరం నుంచి అనపర్తి, కడియం, వేమగిరి మీదుగా రాజమహేంద్రవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *