సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పాతపాటి సర్రాజు గత శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో వర్మ హాస్పిటల్ కి తరలించారు. అయితే మృత్యువు తో పోరాడి కన్నుమూశారు.తదుపరి భీమవరం జేపీ రోడ్డు లో ఉన్న ఆయన నివాస గృహం వద్ద ఆయన భౌతిక కాయం ను ఆయన అభిమానులు శ్రేయోభిలాషుల దర్శనార్ధం ఉంచడం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఆయన నివాసం వద్దకు వచ్చిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు నివాళులు అర్పించారు, సర్రాజు గారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు మరణంతో భీమవరం, ఉండి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు,రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు భీమవరం విశేషంగా తరలివస్తున్నారు. వ్యాపార పరంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయాలలో ప్రజల అభిమానం పొంది కష్టపడి పైకి వచ్చి .. ఎప్పడు ఉత్సహంగా ఉండే ఒక మంచి నేతను, సహచర మిత్రుడిని ఆకస్మికంగా కోల్పోయామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , ఉండి ఎమ్మెల్యే రామరాజు, సంతాపం తెలిపారు. పాతపాటి సర్రాజు భౌతిక దేహానికి నివాళ్లు అర్పించడానికి సీఎం జగన్ నేటి మధ్యాహ్నం భీమవరం రానున్నారు. దీనికి తగిన హెలిపాడ్ ను ఇప్పటికే సిద్ధం చెయ్యడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *