సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణాలో మహబూబాబాద్‌ సమీపంలో బేతోలులో దగ్గర వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ను నేడు, ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్‌కు తరలించారు.దీనితో విశేషంగా వై ఎస్ కుటుంబ అభిమానులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలలోకి వెళితే.. తాను కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల మహబూబాబాద్ జిల్లా నెళ్ళికుదురు మండల కేంద్రంలో తనదయిన శైలిలో కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని సవాల్ చేసారు. శంకర్ నాయక్ ఫై షర్మిల వ్యాఖ్యలు ఉద్రిక్తలు రెచ్చగొతున్నాయని ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చెయ్యడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *