సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బై పాస్ రోడ్డు కు ఇక పూర్తిగా మంచి రోజులు వచ్చాయి. ఒక్క 8 నెలలు వెనక్కి వెళ్ళితే గతంలో ఉండి రోడ్డు నుండి భీమవరం 3 టౌన్ లోని కొడవల్లి రోడ్డును కలుపుతూ వెళ్లే సుమారు 4 కిలో మీటర్లు రోడ్డు గతుకులతో ఉండేది. మెంటే వారి తోట లో ఏకంగా 3 రైల్వే అండర్ టర్నల్ నిర్మాణాలు కోట్లాది రూపాయల ఖర్చుతో జరిగాక అటువైపు ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అయ్యి బైపాస్ వైపు మళ్లటంతో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కృషితో బై పాస్ రోడ్డు మరోసారి నూతనంగా నిర్మించడానికి 2 కోట్ల 20 లక్షల రూపాయలతో సి సి రోడ్డు మరియు బీటి రోడ్ నిర్మాణం ప్రారంభిస్తూ గత 2022 మార్చి 5వ తేదీన శంకుస్థాపనతో రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. మొదటవిడతగా2 న్నర కిలో మీటర్లు పైగా పరిధిలో తారు రోడ్డు ను బివి రాజు మార్గ్ చౌరస్తా నుండి కొడవల్లి రోడ్డు వరకు గత ఏడాది మే నెలకు శరవేగంగా పూర్తీ చేసి వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే మరోవైపు బివి రాజు విగ్రహం నుండి ఉండి రోడ్డు వరకు కాంట్రాక్టర్లుకు, అధికారులకు సమన్వయం కుదరక , నిధుల సమస్యతో బిట్ బిట్ లుగా సిసి రోడ్డులు వెయ్యడం వాటి మధ్య 20 అడుగుల పలు గ్యాపులు పూర్తీ చెయ్యకుండా వదిలెయ్యడంతో వాటిలో భారీ గుంతలు పడి వాహనదారులు ప్రమాదభరితంగా ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై మొదటగా 2022 ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో మన ‘సిగ్మా న్యూస్’ లో ‘సగం సగం పనులు..’ అంటూ పలుమారులు న్యూస్ కధనాలు వెయ్యడంతో అధికారులలో కదలిక వచ్చింది.( ఇక అటు ఎంపీ, రఘురామా కృష్ణంరాజు, ఇటు స్థానికంగా జనసేన పార్టీ నేతలు కూడా దీనిని పూర్తీ చేయాలని ఒత్తిడి చెయ్యడం జరిగింది) దానితో సెప్టెంబర్ 2వ వారంలో పనులు మొదలు పెట్టి, భారీ వర్షాలు మధ్య అవాంతరాలతో పనులు పూర్తీ చేస్తూ ,ఎట్టకేలకు గత జనవరి2023 నాటికీ 90 శాతం రోడ్డు నిర్మాణం పూర్తీ చేసారు. ఇక స్థానిక SR కాలేజీ నుండి ఉండి రోడ్డు వరకు కలుపుతూ సుమారు 200 అడుగుల రోడ్డు నిర్మాణం గత 7 రోజులుగా కొనసాగుతుంది. ఇప్పుడు సిమెంట్ రోడ్డు గా పూర్తీ చేస్తున్నారు. ( ఫై ఫొటోలో చూడవచ్చు)మొత్తానికి సుమారు 4 కిమీ బైపాస్ రోడ్డు లో కొసరు పనులు కూడా పూర్తీ అయ్యి మరి కొద్దీ రోజులలో బైపాస్ పూర్తిస్థాయిలో వాహనదారులకు సిద్ధం అవుతుతోంది.
