సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, సోమవారం నందమూరి తారకరత్న అంత్యక్రియలు నేటి సాయంత్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ లో అతని భౌతిక దేహానికి అతని నందమూరి కుటుంబసభ్యులు మామయ్య ఎంపీ విజయసాయి రెడ్డి తో పాటు, చిరంజీవి, వెంకటేష్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తారకరత్న కుటుంబసభ్యుల ను పరామర్శించారు. ( ఫై చిత్రాలలో చూడవచ్చు) పలువురు ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ..కేవలం 40 ఏళ్ల వయస్సులోనే తారకరత్న చనిపోయవడం విచారకరమని ఆవేదన చెందారు. 20 ఏళ్లలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి 24కు సినిమాల్లో నటించారని తెలిపారు. తారకరత్న కుటుంబానికి, నందమూరి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *