సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, సోమవారం మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. ఎస్సీ , ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేశామని చెబుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగానే.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. కాగా, 18 స్థానాలకు గాను బీసీలకు 11, ఎస్సీ లకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..స్థానిక సంస్థలు.. పశ్చిమ గోదావరి జిల్లా నుండి భీమవరం నియోజకవర్గానికి చెందిన, ప్రస్తుత జడ్పీ చైర్మెన్ కవురు శ్రీనివాస్( బీసీ-శెట్టి బలిజ) మరియు లోకల్ కోటా నుండి తణుకు కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.. వంకా రవీం ద్రనాథ్ లను ఎంపిక చెయ్యగా, నత్తు రామారావు.. శ్రీకాకుళం , లోకల్ కోటా (బీసీ, యాదవ)- కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి,- మేరుగ మురళి.. నెల్లూరు, లోకల్ కోటా (ఎస్సీ -మాల)- డా. సిపాయి సుబ్రహ్మణ్యం .. చిత్తూరు, లోకల్ కోటా- రామసుబ్బా రెడ్డి.. కడప, లోకల్ కోటా (ఓసీ-రెడ్డి)- డాక్టర్ మధుసూదన్.. కర్నూలు, లోకల్ కోటా (బీసీ-బోయ)- ఎస్. మంగమ్మ ..అనంతపురం, లోకల్ కోటా( బీసీ-బోయ) ఎమ్మెల్యే కోటా..- పెనుమత్స సూర్యనారాయణ రాజు .. విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం )- పోతుల సునీత.. ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మ శాలి)- కోలా గురువులు.. విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్ కార్పొ రేషన్ ఛైర్మన్) మరియు బొమ్మి ఇజ్రాయిల్.. తూ. గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ -మాదిగ)- జయమంగళ వెంకటరమణ, ఏలూరు జిల్లా , లోకల్ కోటా (వడ్డీల సామాజిక వర్గం )– ఏసురత్నం .. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)- మర్రి రాజశేఖర్.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ ) ఎంపిక కాగా గవర్నర్ కోటా నుండి కుంభా రవి.. అల్లూరి జిల్లా, (ఎస్టీ)- కర్రి పద్మ శ్రీ.. కాకినాడ, (బీసీ) ని ప్రతిపాదించారు.
