సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గన్నవరం లో టీడీపీ పార్టీలో రెబల్ గా మారి సీఎం జగన్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే వంశీ వర్గంతో స్థానిక టీడీపీ నేతల మధ్య రెచ్చగొట్టుడు సవాళ్లు పరిధులు దాటి ఆస్తుల విద్వంసానికి దాడి ప్రతిదాడులు స్థానిక సీఐ గాయపడటం జరగటంతో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నేత, మీడియా ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ని పోలీసులు నిన్న మంగళవారం అరెస్ట్ చేసి నేడు, బుధవారం కోర్ట్ ఆదేశాలతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు. నేటి బుధవారం ఉదయం గన్నవరంలో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పట్టాభిని హాజరుపరిచారు. ఆయన తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టారని నిన్న కోర్ట్ లో ఆరోపించడంతో ఆయన ఆరోగ్యం ఫై వైద్య నివేదికను పరిశీలించిన తరువాత న్యాయమూర్తి ఆయన్ను గన్నవరం సబ్ జైలుకు పంపాలని ఆదేశించారు. అయితే గన్నవరం జైలులో సౌకర్యా లు తగినంత లేకపోవడం , ఇతర ఇబ్బం దుల దృ ష్ట్యా గన్నవరం లో అరెస్ట్ అయిన టీడీపీ నేతలను వేరే జైలుకు తరలించాలనే మరో అభ్యర్థనను పోలీసులు న్యా యస్థానం ముందుపెట్టారు. పోలీసుల తాజా అభ్యర్థనపై న్యాయమూర్తి విచారించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టాభిని కోర్ట్ అనుమతిస్తే .. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి.
