సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఇకపై స్కూల్స్ ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకు మాత్రమే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు తాజగా ఆదేశాలు పంపింది. ‘‘చిన్నారుల పునాది దశ విద్యా భ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఒకటో తరగతి కన్నా ముం దస్తు విద్య (ప్రీ స్కూ ల్ ఎడ్యు కేషన్) నిర్వహించవలసి ఉంది. తరువాత , 2 ఏళ్లు ప్రాథమికవిద్య లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు మేధస్సు వికసించడానికి ఎలాంటి అడ్డంకులు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *