సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మం త్రి కన్నా లక్ష్మీ నారాయణ నేడు, గురువారం తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు సమక్షంలో చేరారు. నేటి మధ్యా హ్నం గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ముందుగా నిశ్చయిం చుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు అధినేత చంద్రబాబుసమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీ నారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. మొదట్లో కన్నా జనసేనలో చేరాలనుకొన్నప్పటికీ ప్యూహం మార్చి టీడీపీ లో చేరటం విశేషం.
