సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిడదవోలు పట్టణంలో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్ నందు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె .. డా.సౌమ్యశ్రీ, చి.వెంకట శివతేజ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి నేడు, బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గోదావరి జిల్లాల వైసిపి నేతలు, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర రాజకీయపార్టీ ల ప్రముఖులు విశేషంగా పాల్గొనడం జరిగింది.
