సిగ్మాతెలుగు డాట్, ఇన్: న్యూస్: గోదావరి సంగమంకు హాజరుకానున్న RSS చీఫ్ పాలకొల్లు, డిసెంబరు 25 గోదావరి సంగమం పేరుతో తరుణ సాంఘీక్ ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) పాలకొల్లులో ఏర్పాటు చేయటం జరిగినది.ఈ నెల 26 వ తేదిన ఆదివారం నాడు పాలకొల్లు పెనుమదం రోడ్డులో RR రైస్ మిల్లర్స్ ప్రాంగణంలో మధ్యాహ్ననం 3 గంటల నుండి ప్రారంభం కానుంది.ఈ సాంఘీక్ లో RSS చీఫ్ పరమపూజనీయ సర్ సంఘచాలక్ మాన్య శ్రీ మోహనరావు భగవత్ మార్గదర్శనం చేస్తారు.తూర్పూ,పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వేలాదిగా RSS కార్యకర్తలు పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో నాగార్జున కనట్రక్సన్ కంపెనీ అధినేత ASN RAJU ముఖ్య అతిథిగా పాల్గొంటారు క్షేత్ర సహ సంఘచాలక్ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘచాలక్ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి,ప్రాంత సహ సంఘచాలక్ సుంకవల్లి రామకృష్ణ, భీమవరం విభాగ్ సంఘచాలక్ మంతెన రామచంద్రరాజు,రాజమండ్రి విభాగ్ సంమచాలక్ రిమ్మలపూడి సుబ్బరాజు తదితరులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *