సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక డీఎన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది చే నేడు, మంగళవారం రామకృష్ణ సభ భవనము నందు పాలి పేస్ట్ 2023 అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు మాట్లాడుతూ.. విద్యార్ధులలో ప్రపంచ స్థాయికి అనుగుణంగా సృజనాత్మకత పోటితత్వం వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించుటకు ఇలాంటి వేడుకలు విద్యార్ధులకు నిర్వహిస్తున్నామని అన్నారు. పాలి పేస్ట్ నిర్వహిస్తున్న బృందానికి తన అభినందనలు తెలియ చేసారు. కళాశాల కార్యదర్శి, గాదిరాజు సత్య నారాయణ రాజు మాట్లాడుతూ విద్యార్ధుల్లో చదువుతో పాటు ఎక్స్ ట్రా కర్కిక్యులర్ యక్టివిటిష్ లోను ఈ వేడుక ఒక నూతన ఉత్సాహాన్ని విద్యార్ధుల్లో రేకెత్తిస్తుంది అన్నారు విద్యార్ధులకు కావలసిన సకల సౌకర్యాలు కల్పించటంలో తమ కార్యవర్గం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎమ్ అంజన్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వి.యస్. వర్మ మాట్లాడుతూ.. తమ కళాశాలలో అత్యంత ఆధునికమైన ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన సిబ్బంది, దూర ప్రాంతం నుంచి వచ్చే వారికీ బస్సు సౌకర్యం, ఉచిత హాస్టల్ వసతి, మెరితోరియాన్ విద్యార్ధులకు ఉపకార వేతనాలు పాలి సెట్ ఎగ్జామ్ కు ఉచిత శిక్షణా తరగతులు తమ కళాశాలలో నిర్వహిన్స్తున్నామని తెలిపారు.
