సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏప్రిల్ మూడో తేదీ నుండి జరగనున్న 10 th పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను సన్న ద్ధం చేసి గతం కన్నా ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా అడుగులు వేస్తూ.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్య శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. దానిలో భాగంగా నేటి గురువారం మధ్యాహ్నం 1-30 గంటల నుండి పలు హైస్కూల్స్ లో విద్యార్థులకు ఫ్రీ పైనల్ పరీక్షలు నిర్వహణ ప్రారంభించారు. దీనిని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని డీవైఈవో, ఎం ఈవో తదితర సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షిస్తున్నా రు. దీని ద్వారా విద్యార్థులకు ప్రతి పరీక్ష ఎలా ఉండబోతుందో? ఎలా సమాధానాలు రాయాలో ముందుగానే అవగాహన ఏర్పడుతుంది. ఈసారి పరీక్షలలో గతానికి భిన్నంగా ఒకో సబ్జెక్టు పేపరుకు 100 మార్కుల చొప్పున ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్ల విధానం అమలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *