సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిజ జీవితంలో బాబాయ్, అబ్బాయ్ లు విక్టరీ వెంకటేష్ , రానా తండ్రీకొడుకులుగా నటించిన తొలిసారి వెబ్ సిరీస్ లో నటించిన ‘రానా నాయుడు’ ఓటీటీ వేదిక నెట్ ఫ్లెక్స్ ద్వారా నేటి శుక్రవారం మధ్యాహ్నం( మార్చి 10న) నుండి పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రముఖ బాషలలో నిర్మించిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ ఈ సిరీస్ ఫై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో వెంకటేశ్ రానా నాయుడుగా తనదయిన శైలీలో విజృభించారు.. సీనియర్ హీరో వెంకటేష్ తొలిసారి పగ ప్రతీకారంతో రగిలే వృద్ధుడు పాత్రలో కనిపించారు. ఇది వెంకటేష్ సినిమాలా.. కుటుంబసమేత వెబ్ సిరీస్ కాదని ఇందులో కొంత అసభ్య పదాలు, శృంగారం హింస ఉండటంతో కుటుంబసమేతంగా చూడవద్దని మీకు అసౌకర్యంగా ఉంటె క్షమించాలని వెంకటేష్ ఇప్పటికే ప్రకటించారు. హాలీవుడ్ లో హిట్ అయిన ‘రే డొనొవాన్’ టీవీ సిరీస్ ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచికిఅనుగుణం గా ‘రానా నాయుడు’ను తీర్చి దిద్దారు. రానా కూడా విభిన్నంగా కనిపించారు . 45 నిమిషాల చప్పున 10 భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ లో 5 భాగం నుండి మరింత ఆసక్తిని రేకేతించే సన్నివేశాలు రూపొందించారు.
