సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన భారత సరిహద్దు డ్రాగన్ దేశం.. చైనా అధ్యక్షుడిగా షీ జింపింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక పార్టీ వ్యవస్థ ఉన్న చైనా లో ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు జింపింగ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ నేడు, శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై డ్రాగన్ దేశానికి ఆయన జీవితకాల దేశాధిపతి గా కొనసాగే అవకాసమ్ ఉంది. గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కాంగ్రెస్ సమావేశాల్లో.. 69 ఏళ్ల జింపింగ్ ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా ఘనత సాధించారు. 2012 నుండి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్ చైర్మెన్ గా చైనా లోని మూడు అధికార కేంద్రాలకు ఆయన అదినాయకుడిగా శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *