సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర అంశంగా మరీన ప్రముఖ సీనియర్ నటుడు నరేష్, తన నాలుగో పెళ్లిని నటి పవిత్ర తో చేసుకొన్నట్లు ధ్రువీకరిస్తూ తాజగా నేడు, శుక్రవారం ఒక వీడియో బయట వైరల్ అవుతోంది. డిసెంబర్ 31, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెపుతూ నరేష్, పవిత్ర మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆ మాట నిజం చేస్తూ ఈరోజు అంటే మార్చి 10 వ తేదీన ఇద్దరు పెళ్లిచేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరూ తలంబ్రాలు పోసుకొని, జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నట్టు, ఏడు అడుగులు నడుస్తున్నట్టు వున్న వీడియో మాత్రం బయటకి వచ్చింది.ఇది నరేష్ కి నాలుగో వివాహం. ఇంతకు ముందు మూడు పెళ్లిళ్లు అయ్యాయి, గతంలో అతని వివాహాలు అన్నీ వివాదాలతోనే ముగిసాయి. ఇంతకు ముందు 3వ పెళ్లి చేసుకొన్నా రమ్య రఘుపతి ని వివాహం చేసుకొని ఆమెకి కూడా విడాకులు ఇచ్చాడు. కానీ ఆ కేసు ఇంకా కోర్టులో వుంది. కానీ నరేష్, నటి పవిత్ర తో చాలాకాలం నుండి సహజీవనం గడుపుతున్నారు.ఈ జంట ఇప్పుడు అధికారికింగా ఒక్కటయి, ఏడడుగులు నడిచి ఒక్క టయినట్టుగా నరేష్ తన ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసాడు.
