సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అందరు తెలుగు సినిమా RRR సినిమా ఆస్కార్ సాధించడం పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టారు కానీ భారతదేశానికి మరో ప్రతిష్టాకర ఆస్కార్ అవార్డు ను ‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) అనే చిన్న డాక్యుమెంటరీ ఫీచర్ సినిమా అవలీలగా సాధించింది. ఈ చిత్రం 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ అవార్డును గెలుచుకుంది. ఈ వేడుకలో చిత్ర దర్శకురాలు కార్తికీ గోన్సాల్వేస్ ఈ అవార్డును భారతదేశానికి అంకితం చేసింది. ఆమె గురించి చెప్పుకోవాలంటే.. సోనీ ఆల్ఫా సిరీస్‌కు సోనీ ఇమేజింగ్ అంబాసిడర్‌గా భారతదేశంలో ఎంపికైన మొదటి మహిళల్లో ఒకరు. అంతేకాదు సామాజిక డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ & ఫిల్మ్ మేకర్ కూడా. భారతీయ సహజ చరిత్ర, సోషల్ డాక్యుమెంటరీ ఫోటో జర్నలిస్ట్ . పర్యావరణం, ప్రకృతి, వన్యప్రాణులు, పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది. ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఒక డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, భారతదేశం నుండి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో,నిజజీవితంలో తమిళనాడులో ఒక జంట, అనాథ ఏనుగుల మధ్య ఏర్పడే బంధాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రీకరించి ఆస్కార్ వంటి గొప్ప గౌరవం పొందింది.
