సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధుల 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరిగింది. తాజా సమాచారం ప్రకారం 95 శాతం పైగాఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఇదే పోలింగ్ బూత్ లో ఉండి,ఆకివీడు, తాడేపల్లి గూడెం, కు చెందిన జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సెలర్స్.. మొత్తం 200 పైగా ఓట్లకు గాను దాదాపు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. భీమవరం చాంబర్ అఫ్ కామర్స్ సూచన మేరకు ఆ పరిసర ప్రాంతాలలో దుకాణాలు నేటి సాయంత్రం వరకు మూసివేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటుగా భీమవరం మండలం వీరవాసరం మండలం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జడ్పిటిసి ఎంపిటిసి లు అందరూ ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీందర్ పోలింగ్ తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా వైసిపి అభ్యర్థుల ఘన విజయం తధ్యం అని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కేవలం ఒక్క జడ్ పిసి మాత్రమే ప్రతిపక్షలు గెలిచాయని, అయిన బలం లేని తెలుగుదేశం పార్టీ నేతల వక్ర బుద్ది తో ఇండిపెండెంట్ కు మద్దతు ఇచ్చి ఎన్నికలను అనివార్యం చేసారని, గతంలో బలం లేకపోతె వైసిపి గౌరవంగా పోటీ నుండి తప్పుకొని ఎన్నిక ఏకగ్రీవం చేసిన విషయం గుర్తు చేసారు.
