సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు, సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు కు పోలింగ్ జరుగుతున్నా నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. దానిలో భాగంగా ఈరోజు భీమవరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో జరిగిన MLC ఎన్నికల పోలింగ్ లో మధ్యాహ్నం 2.00 గం. లకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఓటు వేసి వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం రేపటి నుండి జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సమావేశాల కు అడ్జక్షత వహించే నిమిత్తం విజయవాడ బయలుదేరటం జరిగింది.
