సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ, శాసనమండలి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏపీలో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారుల బ్యాంకు అకౌంట్స్ కే నేరుగా సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. సంక్షేమ పధకాల లబద్ధిదారుల గుర్తింపుకోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ప్రకటించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడం గమనార్హం. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి నిరసన తెలుపుతూ టీడీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేసారు.
