సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆన్ స్టాపబుల్ సిరీస్ వెబ్ షోలు. అఖండ, వీర సింహ రెడ్డి, వంటి బంపర్ హిట్స్ తో దూకుసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ .. యాంకరింగ్ చేస్తూ .. జై బాలయ్య సత్తా చాటుతున్నాడు. తాజగా ఆహాలో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరిం చడానికి సిద్దమయ్యాడు. ఆహాలో.. మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో బాలయ్య గెస్ట్ హోస్ట్ గా మెరవబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్ షో కోసం 12 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్లో హీరో బాలకృష్ణ లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. దీనికి సం బంధించిన ఫోటోలను ఆహా ట్వీట్ చేసింది.. ఇంతకు ముందెన్నపుడు చూడని బాలయ్య ను చూస్తారంటూ ట్వీ టర్లో పేర్కొంది
