సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో నేటి బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్‌ పరీక్ష జరగనుంది. ఏపీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,82,677 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 4,65,022 మంది ఉన్నారు.మొత్తంగా10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఏపీలో 1489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసీ బస్సు ఆపాలని బోర్డు అధికారులు సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేయమని కోరారుఇక తెలంగాణలో 1473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 9,47,699 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఫస్టియర్ 4,82,677.. సెకండ్‌ ఇయర్ 4,65,022 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *