సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికలు మాములు ఎమ్మెల్యే ఎన్నికలలో జరిగినట్లు ఒక ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించలేరు. 50 శాతం ఓట్లు రావాల్సిందే, అందుకే గెలుపు తేలకపోతే 2వ ప్రాధాన్యత, 3, లేదా 4వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించవల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానాలలో అధికార వైసిపి ఎనిసెంటర్ సింగిల్ హ్యాండ్ విజయాలు సాధించేసింది, ఐతే గతం నుండి కామ్రేడ్ సోదరులకు అనుబంధమైన సంఘాలు, పార్టీలు పోటీ చేసి గెలిచే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అరుదుగా మాత్రమే రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తుంటారు, ఇందులో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కాగా, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో తొలిసారి వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగారు, ప్రభుత్వం ఫై గరం, గరంగా ఉంటున్న ఉద్యోగ, టీచర్స్ సంఘాలను దూకుడు కు కట్టడి చేసేందుకు సీఎం జగన్ ప్యూహంలో భాగంగా వైసిపి కి అనుభవం లేని ఎన్నికల రంగంలో బరిలో దిగారు, అయితే వైసిపి ఎవరి అంచనాలకు అందని రీతిలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచింది. అయితే విచిత్రంగా పట్టభద్రుల 3 నియోజకవర్గాలలో విజయాలను తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టవలసి వచింది, ఇది శాసనమండలిలో పూర్తీ పట్టు కోల్పోతున్న టీడీపీ కి పునర్జీవం ఇచ్చింది, ప్రభుత్వ నిబంధనలుతో సంక్షేమ పధకాలు అందక పింఛనులు , విద్యార్థులకు అమ్మవడి, కాలేజీ పీజు రియంబర్స్ అందుకోలేక, కేవలం జగన్ సర్కార్ పెంచిన పన్నులు, కరెంట్ బిల్లులు .ట్రాఫిక్ పోలీసులకు నిబంధన ఉల్లంఘన, చలానాలు కడుతూ అవస్థలు పడుతున్న..చదువుకున్న మధ్యతరగతి ప్రజల ఆక్రోశం ఈ 3 విజయాలుతో పరోక్షంగా కట్టబెట్టి టీడీపీ కి ఉపిరిపోసారు. ఇకనైనా జగన్ సర్కార్ కు తమను పట్టించుకోవాలనే సంకేతాన్ని బలంగా ఇచ్చారు. ఇది జగన్ సర్కార్ కు ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లలో తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని సంబరపడాలా? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని దిగాలు పడాలా? అన్నది కీలక ప్రశ్నగా మిగిలింది, ఇక వైసిపి- టీడీపీ బరిలో దిగటంతో ఎక్కువ నష్టపోయిన కామ్రేడ్ సోదరులు సంగతి ఏమిటి? వారి ప్రతినిధులను చట్ట సభలకు పంపించలేకపోయిన లోటు ఎవరు తీరుస్తారు?ఉన్న ఒక్క ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర పట్టభద్రులు సీటు దారుణంగా కోల్పోయిన బీజేపీ పరిస్థితి ఏమిటి?అసలు జనసేన కూడా బరిలో దిగి ఉండి ఉంటె ఎమ్మెల్సీ లో బోణి చేసి ఉండేదా? ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో మిగిలిపోయాయి,..సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *