సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 7గురు ఎమ్మెల్సీ సీట్లకోసం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లో మొత్తం 175మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనడం విశేషం అయితే, వీరిలో 6గురు వైసిపి అభ్యర్థులు విజయం సాధించగా,తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఎమ్మెల్సీ గా గెలచి అధికార వైసిపి కి పెద్ద షాక్ ఇచ్చింది. వివరాలలోకి వెళ్ళితే.. కౌంటింగ్ నేడు, గురువారం సాయంత్రం ప్రారంభమైంది. గంటలోపే ఫలితాలను ప్రకటించారు, .ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలు ఓట్లు వెయ్యడంతో వందశాతం ఓటింగ్ నమోదయింది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. అయితే వైసీపీ కి క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. ముందు నుంచి ఏడు స్థానాల్లోనూ గెలుస్తామని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. వైసీపీ సొంత బలం 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తుండడంతో దాని బలం 155కు చేరింది.జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా వైసిపి కి మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ నేటి ఫలితం వైసిపి కి పెద్ద షాక్ గానే పరిగణించాలి,ఇక ఇంటి దొంగలు పట్టుకొనే పనిలో వైసీపీ అధినాయకత్వం ఉంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *