సిగ్మాతెలుగు డాట్, న్యూస్: శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ మండలి చైర్మన్ చాంబర్ నందు త్వరలో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనున్న ఎమ్మెల్సీలను సన్మానించడం జరిగింది. అందుబాటులో ఉన్న వారిలో వాకాటి నారాయణరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి, మాణిక్య వరప్రసాద్ మాధవ్ లను శాలువాను కప్పి, పుష్పగుచ్చం అందజేసి సన్మానించడం జరిగింది. ఇక నూతన సభ్యుల చేరిక కోసం ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. దీనితో తాజగా శాసనమండలి లో వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే.. ఆం ధ్రప్రదేశ్ శాసనమం డలిలో మొత్తం సీట్లు 58. ప్రస్తుతం అధికార పక్షం వైఎస్సా ర్సిపికి సభలో 44 మంది సభ్యులతో తిరుగులేని ఆధిక్యత తో బలోపేతం కాగా తెలుగుదేశం పార్టీ 10 స్థానాలకు పరిమితమయింది. ఇద్దరు స్వతంత్రులు కాగా, మరో ఇద్దరు పీడీఎఫ్.ఎమ్మెల్సీ సభ్యులు ఉన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *