సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజోలులో గెలిచిన జనసేన ఏకైక ఎమ్మెల్యే, వైసిపి మద్దతుదారుడు రాపాక వర ప్రసాద్ నేడు, ఆదివారం సంచలన వ్యాక్యలు చేసారు, క్రాస్ ఓటింగ్ చేస్తే నాకు టీడీపీ పదికోట్లు ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసింది. నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. తరువాత అసెంబ్లీ దగ్గర కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు నన్ను స్వయంగా కలసి టీడీపీకి ఓటేయమన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ని నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించాను. అని ప్రకటించగా..అయితే.. ఉండి ఎమ్మెల్యే ,మంతెన రామరాజు దీనిని పూర్తీ అవాస్తవమని ఖండించారు, జనసేనలో గెలచి వైసిపిలో చేరిన రాపాక నాపై విలువలు వదిలేసి ఎవరి ప్రోద్బలం తోనో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని విమర్శించారు, అయితే రాపాక నేటి రాత్రి ఒక మీడియా ఛానెల్ లైవ్ డిబేట్ లో మాట్లాడుతూ.. రామరాజు నా దగ్గరికి ఈ 10 కోట్ల రూపాయిల బేరం తెచ్చాడు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యేతో నాతో మాట్లాడారో ?లేదో? సీసీ కెమెరాల్లో చెక్ చేసుకోండి’ అని సవాల్ విసిరారు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. విలువలు గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడకూడదు, చంద్రబాబు కు ఎమ్మెల్యేల ఓట్లు కొనడం కొత్త కాదు. ఆయన వెన్నుపోటు రాజకీయంతోనే సీఎం అయినవాడు.. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికింది చంద్రబాబు కాదా..?.ఆ దెబ్బతో తెలంగాణ ఖాళీ చేసి వచ్చేసి ఆంధ్ర వాళ్లకు ద్రోహం చేసింది ఎవరు? ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి 10 ఏళ్ళు వెనక్కువెళ్ళిందంటే రేవంత్ రెడ్డి తో టీఆరెస్ ఎమ్మెల్యేను కొనుగోలులో దొరికిపోవడం వల్లే కదా ? గతంలో ప్రతిపక్ష వైసీపీ నుండి 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో 4గురిని మంత్రులు చేసిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీది అని విమర్శించారు, నావరకు నేను వైసీపీ వాడినే.. జగన్ తో కల్సి పాదయాత్ర చేశాను, కఎన్నికలు కు ముందే కష్టపడ్డాను . అయితే పార్టీ టికెట్ దక్కక పోవడంతో జనసేనలో పోటీ చేశాను ఒక్కడినే గెలిచాను, వైసీపీకి డైరెక్టుగా సపోర్టు చేసి గడప గడపకు తిరుగుతున్నాను. ఇప్పడు టీడీపీ 10 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తే నలుగురు మాత్రమే వచ్చారు. వీడియోను వైరల్ చేసి ఎవరి మెప్పు పొందాల్సిన అవసరం నాకు లేదు’ అని రాపాక వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *