సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం గా భీమవరం ఆవిర్భవించి ఏడాది పూర్తీ అయిన సందర్భముగా పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వాహించారు. అలాగే జిల్లా కలెక్టర్ శాశ్వత కార్యాలయంగా మార్కెట్ యార్డ్ ను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రావడంతో నేడు, మంగళవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్కడ స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్యాడర్ నుద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్తగా ఏర్పాటైన పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం జిల్లా కేంద్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు సమయంలో జిల్లా కేంద్రం కోసం తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి సీఎం జగన్ ఫై తీవ్ర ఒత్తిడి తెచ్చినా.. నేను ముందస్తుగా జిల్లా కేంద్రం కావాలని పట్టుబట్టడంతో ఆయన మన కోరిక మన్నించారని భీమవరం జిల్లా కేంద్రంగా రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని సృష్టించామన్నారు. అలాగే తాజగా కలెక్టరేట్ ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టరేట్ ను శాశ్వతంగా మార్కెట్ యార్డుకు తరలించాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, త్వరలో కలెక్టరేట్ ను 20 ఎకరాలలో నిర్మాణాలు పూర్తీ అయ్యాక మార్కెట్ యార్డుకు మార్చనున్నారు.ఇక్కడైతే తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు, ఉండి నుండి పనులపై వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు, కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు,కోడె విజయలక్ష్మి,పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, గూడూరి ఉమాబాల చెల్లబోయిన సూర్య ప్రకాష్, మానేపల్లి నాగన్న తదితరులు పాల్గొన్నారు, అనంతరం భారీ కేక్ కట్ చేశారు
· ·
