సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం,లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భీమవరంలో 14 రోజులు పాటు జగనన్నే మా భవిష్యత్తు .. మా నమ్మకం నువ్వే జగన్ .. అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు .. దీనితో ఇంకా పరిష్కారం కానీ ప్రజా సమస్యలు, పరిష్కారం దిశగా వస్తాయని, పేద ప్రజల అభ్యున్నతికి, వారి శ్రేయస్సుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా స్థానిక నియోజకవర్గంలో వార్డు సచివాలయ వాలంటీర్లు, కన్వీనర్లు, గృహ సారధులు 14 రోజులపాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకోవడంతో పాటుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటామని అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వైసిపి క్యాడర్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలను కలుస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రజలనుండి కూడా సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ అవుతుందందని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో భీమవరం నియోజకవర్గ వైసిపి కీలక నేతలు అందరు పాల్గొన్నారు,
