సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా నూజివీడు లో గత రాత్రి తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్‌షో నిర్వహించి, ఆయన ఏకంగా గంటన్నర పాటు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘మాది ప్రజాబలం. జగన్‌ది ధనబలం ఎప్పుడూ ప్రజాబలం ముందు ధన బలం నిలబడదు ఈసారి అదే జరగబోతోంది’ అని రాష్ట్రము అప్పుల కుప్ప అయింది. వీట నుంచి బయటపడాలి. రాష్ట్రంలో సైకో పోవాలి… సైకిల్‌ రావాలి’ అంటూ నినదించారు. జరిగిన నేరాలు, ఘోరాలను ప్రస్తావిస్తూనే మీకు ఇంకా కోపం రావట్లేదా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్‌ నా భవిష్యత్‌ అనే కార్యక్రమంపై సెటైర్లు విసురుతూ నా దరిద్రం అనాలని సభికులకు ఉద్దేశించారు. శని రూపంలో జగన్‌ దాపురించాడని అన్నారు. ఈసారి నూజివీడులో గెలుపు అలవోకగా సాధిస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు. రోజుకు 300 ట్రక్కుల ఇసుకను దోపిడీ చేస్తున్నారు. 300 ఎకరాల అటవీ భూమిని ఎమ్మెల్యే కొడుకు కైంకర్యం చేశాడు అని ఆరోపించారు. .నూజివీడు మామిడిగా ప్రసిద్ధి పొందిన ‘మామిడి రైతు పూర్తిగా నాశనం అయ్యాడు. అధికారంలో ఉంటే ఆదుకునే వాళ్ళం. పామాయిల్‌ మేమే తెచ్చాం. ధరకు తగ్గట్లుగా ప్రభుత్వ సబ్సిడీ లేదు అని విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *