సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కు లను దక్కించుకున్న వయాకామ్ 18.. జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా ఐపీఎల్ ప్రసారాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దేశంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలతో, అదికూడా ఉచితంగా 4K క్వాలిటీలో ఇస్తూ, అంతులేని ఆదరణ పొందిన జియో సినిమా ను అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ పారంగా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ , వెబ్ సిరీస్ ను తన జియో సినిమా యాప్లో అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే, తమ నాణ్యమైన కంటెంట్ కు ప్రేక్షకుల నుండి డబ్బు ను వసూళ్లు చెయ్యనుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ లను మాత్రం ఉచితంగానే ప్రసారం చేస్తామని, ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని ప్రకటించింది.
