సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ఏపీ ప్రజలను ఉద్దేశించి.. దొంగలు, సన్నాసులు.. నీటి దొంగలు , బ్రతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్ ను దోచేశారు.. బిర్యానీ అంటే హైదెరాబాదే.. ఆంధ్ర బిర్యానీ పెంటలా ఉంటుంది..ఇలాంటి దారుణమైన మాటలు..గతంలో ఎంత పెద్ద తెలంగాణ నాయకుడు మాట్లాడారో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మర్చిపోలేరు.. టక్కున చెప్పగలరు. అయితే ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు మరో సారి ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలను, ఇక్కడ నేతలను చేతకానివారుగా కించపరుస్తూ.. ఆంధ్ర ఓటర్లు తెలంగాణ ఓటర్లు గా మారుచుకోండని, తమ బిఆర్ ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ను రక్షిస్తుందని ప్రకటించారు. దానిపై టీడీపీ కిమ్మనలేదు. వైసిపి నేతలు మాత్రం.. తీవ్ర స్థాయిలో ఏపీ ప్రజలు లేకపోతె తెలంగాణకు… అంటూ చెలరేగిపోయారు. దానితో ఈ రాజకీయాలు మనకెందుకు? అని తెలంగాణ పార్టీలు కూడా కిమ్మనలేదు. కానీ ఆసక్తి కరంగా హైదెరాబాద్ లో నివాసం ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజగా వైసిపి నేతలపై మండిపడుతూ.. తెలంగాణ జాతి అన్న ఆ ప్రజలు అన్న నాకెంతో గౌరవం.. మంత్రి హరీష్ రావు ఎదో అన్నాడని ఏపీ మంత్రులు, నేతలు తెలంగాణ జాతిని కూడా అవమానిస్తూ మాట్లాడితే నేను సహించను. ఇక్కడ ఎంతో మంది ఆంధ్ర ప్రజలు బ్రతుకుతున్నారు. వ్యాపారాలు చేసుకొంటున్నారు. ఆస్తులు ఉన్నాయి. వీరిని దృష్టిలో పెట్టుకోకుండా వైసిపి నాయకులు తెలంగాణ వారిని కించపరిస్తే ఎలా? వైసిపి అధిష్టానం వారి నేతలను అదుపులో పెట్టాలి .. తెలంగాణ ప్రజలకు వైసిపి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *