సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశంలో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల మసాలా దినుసులైన జిలకర (జీరా) ధరలు ఆకాశన్నంటాయి. దేశంలో ప్రస్థుతం నెలకొన్న వాతావరణ సంక్షోభం వల్ల, సాధారణంగా 250 రూపాయలు దిగువున ఉండే ”జిలకర” కనీవినీఎరుగని రీతిలో కిలో జిలకర ధర 600 రూపాయలకు పెరిగింది. దేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రమైన గుజరాత్ రాష్ట్రంలోని ఉన్నా నగరంలో జిలకర హోల్ సేల్ ధర క్వింటాల్‌కు 56వేల రూపాయలకు చేరింది. జిలకర సాగు చేసే రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గింది. జిలకర సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే 13 శాతం పెరిగినా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి.దీంతో డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో జిలకర ధరలు అల్ టైం రికార్డు స్థాయిలో పెంచారు.
