సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హితవు పలికారు. ఇటీవల తెలివైన వారు, టెకనాలజీ గురించి తెలిసిన వారు, చదువుకున్నవారే సైబర్ మోసాలకు గురవుతున్నారన్నారు. ఎంతటివారైనా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసగాళ్లు కూడా ఎప్పుడు మొబైల్, ల్యాప్‌టాప్‌లు వాడే యువతను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌లతో ముప్పు తప్పదన్నారు. సెల్‌ఫోన్‌లో అత్యధిక యాప్‌లు ఉండటం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్నారు. అపరిచితులకు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దన్నారు. ఈకేవైసీ, ఆధార్ అప్డేట్, బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామంటూ మాట్లాడే అపరిచితులకు ఓటీపీని చెప్పకూడదన్నారు. అందరమైన అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలు ద్వారా ఫేస్‌బుక్, వాట్సప్, వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో మాయమాటలతో పరిచయం చేసుకొంటున్నారని, కొత్త వారి వీడియో కాల్స్‌ను నమ్మవద్దన్నారు. జిల్లాలో సైబర్ క్రైమ్ బారిన పడి డబ్బు పోగొట్టుకొన్న,బ్లాక్ మెయిల్ కు గురిఅవుతున్న బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి పోలిసుల సహకారం పొంది సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలని పిలుపు నిచ్చారు.
