సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంగా బాగా వెనుకబడిపోయిన హీరో గోపీచంద్ హీరోగా జగపతి బాబు ప్రధాన పాత్రలో వారికీ గతంలో లక్ష్యం వంటి బంపర్ హిట్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సంధిస్తున్న ” రామబాణం”సినిమా ట్రైలర్ తాజగా విడుదల అయ్యి బాగా వైరల్ అవుతుంది. మే 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రయిలర్ విషయానికి వస్తే.. ‘ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించినది కాదు, ప్లాన్ చేసింది కాదు’ అంటూ హీరో గోపీచంద్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. డింపుల్ హయాతి కోల్‌కతా నుంచి వ్లాగర్‌ గా పరిచయం చేశారు. గోపీచంద్, డింపుల్ మధ్య లవ్ ట్రాక్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుందనే హింట్ ఇస్తూనే.. లక్ష్యం తరహాలో హీరోకి అన్నగా మరోసారి జగపతి బాబు ని పరిచయం చేశారు. మనిషికి ఆరోగ్యకరమైన ప్రకృతి ప్రసాదించిన కల్తీ లేని ఆహరం, అందాలని చెబుతూ జగ్గూభాయ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే జగపతి బాబు మంచి.. కార్పొరేట్ మాఫియా రూపంలో అతని కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఇద్దరు బ్రదర్స్ కలిసి వారితో ఎలా పోరాడుతారు అనేదే ఈ సినిమా మెయిన్ థీమ్ అనేలా ట్రైలర్‌లో రివీల్ చేశారు. ఖుష్బు ఈ సినిమాకు మరో అసెట్ అనేలా ఉంది. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరుల కావల్సినంత వినోదాన్ని పంచినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *