సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజక పరిధిలో నూతనంగా ఏర్పడిన సహకార సంఘాలు, పాలకవర్గాలు రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వీరవాసరం మండలం అండలూరు సొసైటీకి నూతన త్రిసభ్య కమిటీగా ఎంపికైన త్రిసభ్య కమిటీ చైర్మన్, మానుకొండ ప్రదీప్, సభ్యులు చవ్వాకుల రాజేష్ కుమార్, బొంతు కాళిదాసులు నేడు, శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ రైతులకు మేలు జరిగేందుకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఒక ప్రక్క సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్న ప్రభుత్వం రైతులకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. ఇక రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను కలిసారు. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.
