సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ నెల 28న విజయవాడ రానున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ కున్న సీనియర్ అభిమానులు , తెలుగు దేశం పార్టీ సంయుక్తంగా ఎన్టీఆర్ జిల్లా, పోరంకి ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఓ వీడియో ద్వారా తెలిపారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలు ఛైర్మన్ జనార్థన్‌గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి విజయవాడతో నాన్నకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన పుట్టిన జిల్లా ఇది. చదువు, నాటకరంగం అంతా ఈ ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత చలచచిత్ర రంగంలో అడుగుపెట్టారు. అందుకే విజయవాడలో అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతోపాటు ఎందరో ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే’’ అని చెప్పారు.
